ఈ నెల 14న బీజేపీలో చేరనున్న ఈటల

V6 Velugu Posted on Jun 10, 2021

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారయ్యింది. ఈ నెల 14న ఆయన కాషాయ కండువా కప్పుకొనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నారు. అదే రోజు ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌  జడ్పీ మాజీ ఛైర్మన్‌ తల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నారు.

భూ కబ్జా ఆరోపణలతో ..కావాలనే కక్ష్య కట్టి కేసీఆర్‌ ఇదంతా చేస్తున్నారని ఆరోపించిన ఈటల.. టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత ఈటల సొంతంగా పార్టీ పెడతారని.. ఊహాగానాలు వినిపించాయి. TRS ను వీడిన తర్వాత ఈటల తన సన్నిహితులతో తదుపరి కార్యచరణపై చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.

Tagged etela rajender, join BJP, June 14

Latest Videos

Subscribe Now

More News