బెంగళూరు: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ శనివారం ఏథర్ రిజ్టాను లాంచ్ చేసింది. ఈ బండి ధర రూ. 1,10,000 (ఎక్స్ షోరూమ్ బెంగళూరు) నుంచి మొదలవుతోంది. స్కిడ్ కంట్రోల్, డ్యాష్‌బోర్డ్‌లో వాట్సాప్ ఉండడం వంటి ఫీచర్లను రిజ్టా మోడల్‌కు యాడ్ చేసింది.
మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. రిజ్టా ఎస్‌లో 2.9 కిలోవాట్‌అవర్ బ్యాటరీని అమర్చారు. రిజ్టా జెడ్ ను 2.9 కిలోవాట్‌అవర్ , 3.7 కిలోవాట్‌అవర్ కెపాసిటీతో తీసుకొచ్చారు.