మల్కాజిగిరిలో ఫాగింగ్కు ఈవీ బండ్లు

మల్కాజిగిరిలో ఫాగింగ్కు ఈవీ బండ్లు
  • 10 అందుబాటులోకి
  • త్వరలో 64 వాహనాల రాక
  • ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలో దోమల ఫాగింగ్ కోసం ఎలక్ట్రానిక్ వెహికల్స్(ఈవీ) ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫస్ట్ పేజ్ లో భాగంగా 10 వాహనాలను కొనుగోలు చేశారు. వీటిని శుక్రవారం ఎల్బీనగర్ సర్కిల్ ఆఫీస్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ద్వారా డీజిల్ ఖర్చు మిగలడంతో పాటు పర్యావరణానికి కూడా ఇబ్బందులు ఉండవని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఈ వాహనాలు ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జీ చేస్తే 150 కిలోమీటర్ల పరిధిలో నాన్​స్టాప్​గా తిరుగుతాయన్నారు. వీటివల్ల ఫాగింగ్ స్పీడప్ అవుతుందన్నారు.

కార్పొరేషన్​పరిధిలో మూడు నుంచి ఆరు నెలల్లో దోమలను నిర్మూలిస్తామన్నారు. ప్రస్తుతం సరూర్నగర్, ఎల్బీనగర్ సర్కిల్లో ని వార్డుల్లో ఫాగింగ్ కోసం 10 వెహికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని, రానున్న రోజుల్లో 74 వార్డుల్లోనూ ఈవీ వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు.