ఫామ్‌‌‌‌లో ఉన్నప్పుడు కూడా టీమ్‌‌‌‌లో చోటు దక్కనప్పుడు నిరాశ కలుగుతుంది: శ్రేయస్

 ఫామ్‌‌‌‌లో ఉన్నప్పుడు కూడా టీమ్‌‌‌‌లో చోటు దక్కనప్పుడు  నిరాశ  కలుగుతుంది: శ్రేయస్

న్యూఢిల్లీ: ఫామ్‌‌‌‌లో ఉన్నప్పుడు కూడా టీమ్‌‌‌‌లో చోటు దక్కనప్పుడు చాలా నిరాశ కలుగుతుందని టీమిండియా బ్యాటర్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయర్లు ఎదుర్కొనే మానసిక సవాళ్ల గురించి అతను ఓ పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో మాట్లాడాడు. ‘ఆత్మ విశ్వాసంతో బాగా కృషి చేసినప్పుడు మనకు చోటు దక్కదు. 

ప్లేయింగ్ ఎలెవన్‌‌‌‌లో ఉండటానికి మనం అర్హులమని తెలిసినప్పుడూ చోటు ఉండదు. తరచుగా ఇలాంటి సందర్భాల్లో నిరాశ కలుగుతుంది’ అని శ్రేయస్‌‌‌‌ పేర్కొన్నాడు. అయితే అల్టిమేట్‌‌‌‌గా టీమ్‌‌‌‌ సక్సెసే అందరికి చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు. ‘జట్టు కోసం ఎవరైనా మంచి పెర్ఫామెన్స్‌‌‌‌తో స్థిరంగా ఆడుతుంటే వాళ్లకు మద్దతు ఇవ్వాలి. 

అంతిమంగా జట్టు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. జట్టు గెలిచినప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. అవకాశాలతో సంబంధం లేకుండా ముందుకు సాగాలి. మన నైతికతకు కట్టుబడి ఉండాలి. మనల్ని ఎవరైన చూసినా, చూడకపోయినా మన పని మనం చేస్తూనే ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం’ అని శ్రేయస్‌‌‌‌ వ్యాఖ్యానించాడు. 

ఆసియా కప్‌‌‌‌లో చోటు కల్పించలేకపోయిన శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ను ఆస్ట్రేలియా–ఎతో తలపడే ఇండియా–ఎ జట్టుకు కెప్టెన్‌‌‌‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.