పృథ్వీ షా పచ్చి మోసగాడు.. నిశ్చితార్థం ఫొటోలు డిలీట్ చేసిన కాబోయే భార్య!

పృథ్వీ షా పచ్చి మోసగాడు.. నిశ్చితార్థం ఫొటోలు డిలీట్ చేసిన కాబోయే భార్య!

Relationship Goals Khatam: భారత యంగ్ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) జీవితంలో మళ్లీ లొల్లి మొదలైంది. ఫామ్ లేక తిప్పలు పడుతుంటే.. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లో పెద్ద షాక్ తగిలింది. పృథ్వీ షా కాబోయే భార్య (Fiancée) ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక సీక్రెట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తాంది. ఎవరి పేరు పెట్టకుండానే.. వాడు నన్ను చాలా సార్లు మోసం చేసిండు, వాడి గురించి బయట నడిచే ప్రతి రూమర్ నిజమే అంటూ ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో లొల్లి.. ఫొటోలు మాయం: 
ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టా స్టోరీలో ఆ పోస్ట్ పెట్టిన కాసేపటికే డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే జనాలు స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. ఇటీవలే మార్చి (IPL 2026కి ముందు) నెలలో పృథ్వీ షా, ఆకృతిల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. కానీ ఇప్పుడు ఆకృతి తన అకౌంట్ నుంచి ఎంగేజ్‌మెంట్ ఫొటోలన్నింటినీ డిలీట్ చేసింది. అంతేకాదు పృథ్వీ షాను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కూడా చేసింది. దీంతో వీరిద్దరి బంధం తెగిపోయిందని విషయం గట్టిగనే నడుస్తోంది. అయితే దీనిపై పృథ్వీ షా గానీ, ఆకృతి గానీ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.  

ఐపీఎల్ 2026 లో బెంచ్‌కే పరిమితం: 
పృథ్వీ షా ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. ఈ టోర్నీలో రచ్చ చేసి మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా ఆశపడ్డాడు. ఇండియాకు ఆడాలనే కోరిక ఎవరికి ఉండదు? అందుకోసమే నా బ్యాటింగ్, ట్రైనింగ్ మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాను అని పృథ్వీ షా అన్నాడు. కానీ పాపం.. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఛాన్స్ ఇవ్వకుండా టోర్నీ మొత్తం బెంచ్‌కే పరిమితం చేసింది. దీంతో టీమిండియాలోకి కమ్‌బ్యాక్ చేయాలనే ఆశలు పూర్తిగా గాల్లో కలిసిపోయాయి.

ALSO READ : 10 వేల పరుగులు కొట్టావ్.. అందుకే టెస్టులకు టాటా చెప్పేశావా?.. 

వివాదాల షా.. కెరీర్ ఖతం: 
ఒకప్పుడు అండర్-19 వరల్డ్ కప్ గెలిపించి, 18 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చి నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అవుతాడనుకున్న పృథ్వీ షా కెరీర్.. ఫిట్‌నెస్ సమస్యలు, బ్యాడ్ ఫామ్, మైదానం వెలుపల జరిగిన గొడవల (Controversies)తో పూర్తిగా పాతాళానికి పడిపోయింది. ఇప్పటి వరకు ఇండియా తరఫున ఆడిన 5 టెస్టుల్లో 339 రన్స్ (ఒక సెంచరీ), 5 వన్డేల్లో 189 రన్స్ మాత్రమే చేసిండు. ప్రస్తుతం భారత సెలెక్టర్ల ఆలోచనల్లో కనీసం అతడి పేరు కూడా లేదు.. అటు ఆట లేక, ఇటు లవ్ స్టోరీ బ్రేక్ అవ్వడంతో పృథ్వీ షా పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడింది.