వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి : ఆది శ్రీనివాస్

వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి : ఆది శ్రీనివాస్

ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇప్పుడు ఉన్నా పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ సంపదను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటుందన్నారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలు చేస్తూనే  అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. వన మహోత్సవంలో నాటిన మొక్కలను కాపాడే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

 ప్రజలు అనారోగ్యగా బారిన పడకుండా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు వైద్యారోగ్య శాఖ వారికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలిపిందని అన్నారు. యంత్రంగం అప్రమత్తంగా ఉంది రాబోవు రోజుల్లో ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీటవేస్తుందన్నారు. ప్రతి ఒక్క పౌరుడు  బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలన్నారు ఆది శ్రీనివాస్.