
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నాయని, ఏవీ కూలలేదని, ఇదే విషయాన్ని తాను నిరూపిస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం వచ్చినా, మంత్రులు వచ్చిన రైతుల సమక్షంలోనే చర్చిద్దామని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు 3 రోజులు టైమ్ఇస్తే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేయించి చూపిస్తామన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలన వల్లే నల్గొండలో ఫ్లోరోసిస్ మహమ్మారి 2 లక్షల మందిని కబళించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ రోజులను తీసుకొస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మహామహులను మట్టికరిపించానని, భవిష్యత్‌లో తానేంటో చూపిస్తానన్నారు.