యుద్ధం అంటే రొమాంటిక్గా ఉండదు .. బాలీవుడ్ సినిమా అంతకన్నా కాదు:ఆర్మీ మాజీ చీఫ్

యుద్ధం అంటే రొమాంటిక్గా ఉండదు .. బాలీవుడ్ సినిమా అంతకన్నా కాదు:ఆర్మీ మాజీ చీఫ్

భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై వస్తున్న  విమర్శలకు  భారత  ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవాణే  కౌంటర్ ఇచ్చారు.  యుద్ధం అంటే  రొమాంటిక్  గా ఉండదని..బాలీవుడ్  సినిమా అంతకన్నా కాదని  అన్నారు. యుద్ధం తాలుక గాయాలు తరతరాలు వెంటాడుతాయన్నారు.

పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో  మాట్లాడిన మనోజర్ నరవాణే .. ఆదేశిస్తే యుద్ధానికి వెళ్తా.. కానీ  కానీ దౌత్య పరమైన చర్చలకే నా మొదటి ప్రాధాన్యత ఇస్తా. యుద్ధం అనేది రొమాంటిక్ గా ఉండదు .. ఇది మీ బాలీవుడ్ సినిమా కాదు. యుద్ధం గాయాలు తరతరాలు వెంటాడుతాయి. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రిపూట ఆశ్రయ కేంద్రాలకు పరుగెత్తాల్సి ఉంటుంది.  యుద్ధం  మన లక్ష్యం కాదు..వార్ చాలా సీరియస్ ఇష్యూ. యుద్ధం చివరి అవకాశమే.  కొందరు మూర్ఖుల వల్ల యుద్దం చేయాల్సి రావొచ్చు . కానీ దౌత్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అని అన్నారు.

పహల్గామ్ అటాక్ కు బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో మూడు రోజులు పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాలు మే 10న కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అయితే భారత్ ఏం సాధించిందని కాల్పుల విరణమణకు ఒప్పుకున్నారని  కొందరు విమర్శలు చేస్తున్నారు.  గుంటనక్క పాకిస్తాన్ ను వదలొద్దని కామెంట్ చేస్తున్నారు.  విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే యుద్ధం గురించి మనోజ్ నరవాణే ఈ వ్యాఖ్యలు చేశారు.