అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్సే

అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్సే
  • భట్టివి అవగాహన లేని ఆరోపణలు

హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోదీ, రేవంత్ రెడ్డి కలిసి సింగరేణిని అమ్ముతారని కేసీఆర్ ముందే చెప్పారని గుర్తుచేశారు. సింగరేణిని కాపాడే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదని ఎద్దేవాచేశారు.

తెలంగాణ భవన్​లో వినోద్​మీడియాతో మాట్లాడుతూ ‘మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్లుకు మద్దతిచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నరు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ 2013లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో ఆర్డినెన్స్ రూపంలో చట్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన అంటే జోక్ గా మారింది.

సెక్షన్ 17ఏ  కింద బొగ్గు గనులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర ప్రభుత్వం దగ్గరకు రేవంత్ రెడ్డి, భట్టి తీసుకెళ్లి బొగ్గు గనులను సింగరేణికి వచ్చే విధంగా కృషి చేయాలి’ అని సూచించారు.