నేటి నుంచే కామన్వెల్త్ గేమ్స్.. భారీ ఆశలతో బరిలోకి భారత్

నేటి నుంచే కామన్వెల్త్ గేమ్స్..  భారీ ఆశలతో బరిలోకి భారత్

ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడలకు రంగం సిద్దమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఈ క్రీడా సంగ్రామం మొదలవనుంది.  ఇవాళ అర్థరాత్రి క్రీడల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆరంభ వేడుకల్లో ఫ్లాగ్ బేరర్గా పీవీ సింధు వ్యవహరించనుంది. ఒలింపిక్‌‌ చాంప్​ నీరజ్‌‌ చోప్రా గాయంతో పోటీలకు దూరం కావడంతో అతని స్థానంలో  ఇండియా ఫ్లాగ్​ బేరర్​గా పీవీ సింధు ఎంపికైంది.  ఓపెనింగ్​ సెర్మనీలో జాతీయ పతాకాన్ని పట్టుకుని అథ్లెట్ల బృందం ముందు పీవీ సింధు నడవనుంది. ఓపెనింగ్ సెర్మనీలో  164 మంది అథ్లెట్లు, అధికారులు పాల్గొంటారు. ఆగస్ట్  8 వరకు 12 రోజుల పాటు ఈ మెగా టోర్నీ జరగనుంది.

కామన్వెల్త్ గేమ్స్ మనకు అచ్చొచ్చింది..
ఒలింపిక్స్ లో అంచనాలను అందుకోని భారత్..కామన్వెల్త్ గేమ్స్లో మాత్రం అదరగొట్టింది. పతకాలను కొల్లగొడుతూ..క్రీడాకారులు దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. 2002 నుంచి కామన్వెల్త్ గేమ్స్ లో భారత్..టాప్ -5లో నిలుస్తూ వస్తోంది. ఇక 2018లో గోల్డ్‌‌కోస్ట్‌‌లో జరిగిన గేమ్స్ లో  66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇందులో 25 శాతం పతకాలు షూటింగ్ లోనే రావడం విశేషం. అయితే ఈసారి షూటింగ్ లేకపోవడం భారత్కు పెద్ద దెబ్బ కానుంది. అయితే వెయిట్‌‌లిఫ్టింగ్‌‌, బ్యాడ్మింటన్‌‌, బాక్సింగ్‌‌, రెజ్లింగ్‌‌, టేబుల్‌‌ టెన్నిస్‌‌పై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.

ఏ రోజు ..ఏ ఆట..
కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్స్ షెడ్యూల్
 జూలై 30
నితేందర్ రావత్: పురుషుల మారథాన్

 ఆగస్టు 2
అవినాష్ సేబుల్: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్
మురళీ శ్రీశంకర్: పురుషుల లాంగ్ జంప్
ముహమ్మద్ అనీస్ యాహియా: పురుషుల లాంగ్ జంప్
ధనలక్ష్మి శేఖర్: మహిళల 100మీ
జ్యోతి యర్రాజీ: మహిళల 100 మీటర్ల హర్డిల్స్
మన్‌ప్రీత్ కౌర్: మహిళల షాట్‌పుట్
నవజీత్ కౌర్ ధిల్లాన్: మహిళల డిస్కస్ త్రో

 ఆగస్టు 3
ఐశ్వర్య బి: మహిళల ట్రిపుల్ జంప్

ఆగస్టు 5
అబ్దుల్లా అబూబకర్: పురుషుల ట్రిపుల్ జంప్
ప్రవీణ్ చిత్రవేల్: పురుషుల ట్రిపుల్ జంప్
ఎల్డోస్ పాల్: పురుషుల ట్రిపుల్ జంప్
నీరజ్ చోప్రా: పురుషుల జావెలిన్ త్రో
DP మను: పురుషుల జావెలిన్ త్రో
రోహిత్ యాదవ్: పురుషుల జావెలిన్ త్రో
సందీప్ కుమార్: పురుషుల 10 కి.మీ రేసు నడక
అమిత్ ఖత్రి: పురుషుల 10 కి.మీ రేసు నడక
ఐశ్వర్య బి: మహిళల లాంగ్ జంప్
ఆన్సి సోజన్: మహిళల లాంగ్ జంప్
అన్నూ రాణి: మహిళల జావెలిన్ త్రో
శిల్పా రాణి: మహిళల జావెలిన్ త్రో
మంజు బాలా సింగ్: మహిళల హ్యామర్ త్రో
సరితా రోమిత్ సింగ్: మహిళల హ్యామర్ త్రో

 ఆగస్టు 6
అమోజ్ జాకబ్: పురుషుల 4x400 మీటర్ల రిలే
నోహ్ నిర్మల్ టామ్: పురుషుల 4x400 మీటర్ల రిలే
ఆరోకియా రాజీవ్: పురుషుల 4x400 మీటర్ల రిలే
మహ్మద్ అజ్మల్: పురుషుల 4x400 మీటర్ల రిలే
నాగనాథన్ పాండి: పురుషుల 4x400 మీటర్ల రిలే
రాజేష్ రమేష్: పురుషుల 4x400 మీటర్ల రిలే
భావా జాట్: మహిళల 10 కి.మీ రేసు నడక
ప్రియాంక గోస్వామి: మహిళల 10 కి.మీ రేస్ వాక్
హిమా దాస్: మహిళల 4x100 మీటర్ల రిలే
ద్యుతీ చంద్: మహిళల 4x100 మీటర్ల రిలే
శ్రబని నందా: మహిళల 4x100మీ రిలే
MV జిల్నా: మహిళల 4x100m రిలే
NS సిమి: మహిళల 4x100m రిలే

కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్  షెడ్యూల్
 జూలై 29
అశ్విని పొనప్ప, బి సుమీత్ రెడ్డి: మిక్స్‌డ్ డబుల్స్

ఆగస్టు 3
పి.వి. సింధు: మహిళల సింగిల్స్
ఆకర్షి కశ్యప్: మహిళల సింగిల్స్
లక్ష్య సేన్: పురుషుల సింగిల్స్
కిదాంబి శ్రీకాంత్: పురుషుల సింగిల్స్

ఆగస్టు 4
ట్రీసా జాలీ: మహిళల డబుల్స్
గాయత్రి గోపీచంద్: మహిళల డబుల్స్
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి: పురుషుల డబుల్స్
చిరాగ్ శెట్టి: పురుషుల డబుల్స్

కామన్వెల్త్ గేమ్స్ 2022 బాక్సింగ్ షెడ్యూల్
 జూలై 30
అమిత్ పంఘల్: పురుషుల 51 కేజీలు
మహ్మద్ హుసాముద్దీన్: పురుషుల 57 కేజీలు
శివ థాపా: పురుషుల 63.5 కేజీలు
రోహిత్ టోకాస్: పురుషుల 67 కేజీలు
సుమిత్ కుందు: పురుషుల 75 కేజీలు
ఆశిష్ చౌదరి: పురుషుల 80 కేజీలు
సంజీత్ కుమార్: పురుషుల 92 కేజీలు
సాగర్ అహ్లావత్: పురుషుల 92+ కేజీలు
నీతూ ఘంఘాస్: మహిళల 48 కేజీలు
నిఖత్ జరీన్: మహిళల 50 కేజీలు
జాస్మిన్ లంబోరియా: మహిళల 60 కేజీలు
లోవ్లినా బోర్గోహైన్: మహిళల 70 కేజీలు

కామన్వెల్త్ గేమ్స్ 2022 లో  మహిళల క్రికెట్  షెడ్యూల్
జూలై 29: ఆస్ట్రేలియా vs భారత్
జూలై 31: భారత్ vs పాకిస్థాన్
ఆగస్ట్ 3: బార్బడోస్ vs భారత్
కామన్వెల్త్ గేమ్స్ 2022 లో మెన్స్ హాకీ షెడ్యూల్
జూలై 31: భారత్ vs ఘనా
ఆగస్టు 1: ఇంగ్లండ్ vs భారత్
ఆగస్టు 3: కెనడా vs భారతదేశం
ఆగస్ట్ 4: ఇండియా vs వేల్స్
కామన్వెల్త్ గేమ్స్ 2022 లో ఉమెన్స్ హాకీ షెడ్యూల్
జూలై 29: భారత్ vs ఘనా
జూలై 30: ఇండియా vs వేల్స్
ఆగస్టు 2: భారత్ vs ఇంగ్లండ్
ఆగస్టు 3: కెనడా vs భారతదేశం

కామన్వెల్త్ గేమ్స్ 2022లో  మెన్స్ టేబుల్ టెన్నిస్ షెడ్యూల్
జూలై 29: రౌండ్ 1 & రౌండ్ 2
జూలై 30: రౌండ్ 3
31 జూలై: క్వార్టర్-ఫైనల్
ఆగస్టు 1: సెమీ ఫైనల్స్
ఆగస్టు 2: ఫైనల్స్
కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఉమెన్స్ టేబుల్ టెన్నిస్ షెడ్యూల్
జూలై 29: రౌండ్ 1 & రౌండ్ 2
30 జూలై: రౌండ్ 3 & క్వార్టర్-ఫైనల్స్
31 జూలై: సెమీ ఫైనల్స్
ఆగస్టు 1: ఫైనల్స్

కామన్వెల్త్ గేమ్స్ 2022లో  వెయిట్ లిఫ్టింగ్ షెడ్యూల్
 జూలై 30
మీరాబాయి చాను: మహిళల 55 కేజీలు
సంకేత్ మహదేవ్: పురుషుల 55 కేజీలు
చనంబం రిషికాంత సింగ్: పురుషుల 55 కేజీలు

 జూలై 31
బింద్యారాణి దేవి: మహిళల 59 కేజీలు
జెరెమీ లాల్రిన్నుంగా: పురుషుల 67 కేజీలు
అచింత షెయులీ: పురుషుల 73 కేజీలు

 ఆగస్టు 1
పాపీ హజారికా: మహిళల 64 కేజీలు
అజయ్ సింగ్: పురుషుల 81 కేజీలు

 ఆగస్టు 2
ఉషా కుమార: మహిళల 87 కేజీలు
పూర్ణిమా పాండే: మహిళల 87+ కేజీలు
వికాస్ ఠాకూర్: పురుషుల 96 కేజీలు
రాగాల వెంకట్ రాహుల్: పురుషుల 96 కేజీలు
మీరాబాయి చాను: మహిళల 55 కేజీలు
సంకేత్ మహదేవ్: పురుషుల 55 కేజీలు
చనంబం రిషికాంత సింగ్: పురుషుల 55 కేజీలు

 జూలై 31
బింద్యారాణి దేవి: మహిళల 59 కేజీలు
జెరెమీ లాల్రిన్నుంగా: పురుషుల 67 కేజీలు
అచింత షెయులీ: పురుషుల 73 కేజీలు
కామన్వెల్త్ గేమ్స్ 2022లో రెజ్లింగ్ షెడ్యూల్

ఆగస్టు 5
బజరంగ్ పునియా: పురుషుల 65 కేజీలు
దీపక్ పునియా: పురుషుల 86 కేజీలు
మోహిత్ గ్రేవాల్: పురుషుల 125 కేజీలు
అన్షు మాలిక్: మహిళల 57 కేజీలు
సాక్షి మాలిక్: మహిళల 62 కేజీలు
దివ్య కక్రాన్: మహిళల 68 కేజీలు

ఆగస్టు 6
రవి కుమార్ దహియా: పురుషుల 57 కేజీలు
నవీన్: పురుషుల 74 కేజీలు
దీపక్: పురుషుల 97 కేజీలు
పూజా గెహ్లాట్: మహిళల 50 కేజీలు
వినేష్ ఫోగట్: మహిళల 53 కేజీలు
పూజా సిహాగ్: మహిళల 76 కేజీలు