క్యాన్సర్‌‌‌‌ ముప్పు తగ్గించే యోగ!

క్యాన్సర్‌‌‌‌ ముప్పు తగ్గించే యోగ!

ప్రతి  రోజు గంటపాటు ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేస్తే క్యాన్సర్‌‌‌‌ రాదట. ఫిజికల్‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ క్యాన్సర్‌‌‌‌ ముప్పు తగ్గిస్తుందని చెప్తున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. బ్రిస్క్‌‌ వాకింగ్‌‌, మీడియం పేస్డ్‌‌ స్విమ్మింగ్‌‌, సైక్లింగ్‌‌తో క్యాన్సర్‌‌ను‌‌ దూరం పెట్టొచ్చు. అలాగే, క్యాన్సర్‌‌‌‌ నుంచి బయటపడిన వారు చేస్తే.. మళ్లీ అటాక్‌‌ అయ్యే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని క్యాన్సర్‌‌‌‌పై చేసిన చాలా స్టడీస్​లో తేలింది. ఎక్సర్‌‌‌‌సైజ్‌‌తో పాటు ఈ మూడు యోగాసనాలు కూడా క్యాన్సర్‌‌‌‌ను దూరంగా ఉంచుతాయి. ఈ మూడు ఆసనాలు బ్లడ్‌‌ సర్క్యులేషన్‌‌ బాగా మెరుగు పరుస్తాయి. దీంతో క్యాన్సర్‌‌‌‌కు చెక్‌‌పెట్టొచ్చు. ఈ ఆసనాల వల్ల మన బాడీలో స్ట్రెంత్‌‌ కూడా పెరుగుతుంది. ఆ ఆసనాలు ఏంటో చూద్దామా మరి!

గోముఖాసన

గోముఖాసన ఎక్కువగా మెడిటేషన్‌‌ చేసేటప్పుడు వేస్తారు. ఈ ఆసనం ద్వారా స్టెబిలిటీ పెరుగుతుంది. దీన్ని కామింగ్‌‌పోజ్‌‌ అంటారు. ఈ ఆసనంలో బాడీ అంతా స్ట్రెచ్‌‌ అవుతుంది.

నౌకాసన

ఈ ఆసనాన్ని బోట్‌‌ పోజ్‌‌ అని కూడా పిలుస్తారు. దీని వల్ల స్ట్రెస్‌‌ దూరమవుతుంది. పొట్ట, తుంటి భాగాలు బలంగా అవుతాయి. దాంతో పాటు హిప్‌‌, జాయింట్‌‌ లెగ్స్‌‌లో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. పొట్ట భాగంలోని అవయవాలను స్టిమ్యులేట్‌‌  చేసి డైజెషన్‌‌ను ఇంప్రూవ్‌‌ చేస్తుంది.

భుజంగాసన

దీన్నే కోబ్రా పోజ్‌‌ అంటారు. ఇది వెన్నెముక బలపడేందుకు ఉపయోగ పడుతుంది. పిరుదులు (బట్‌‌), బట్‌‌ మజిల్స్‌‌, చెస్ట్‌‌, పొట్ట, షోల్డర్స్‌‌, లంగ్స్‌‌ పనితీరు మెరుగుపడుతుంది. దాంతో పాటు బ్లడ్‌‌ సర్క్యులేషన్‌‌ కూడా బాగా జరుగుతుంది. ఆస్తమా పేషెంట్లు ఈ ఆసనం వేస్తే మంచిది.