13 శాతం తగ్గిన ఎగుమతులు.. చైనాతో వాణిజ్య లోటు రూ.8.50 లక్షల కోట్లు

13 శాతం తగ్గిన ఎగుమతులు.. చైనాతో వాణిజ్య లోటు రూ.8.50 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: అమెరికా విధించిన భారీ సుంకాల వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో మనదేశ ఎగుమతుల విలువ 13 శాతం తగ్గి రూ.57 వేల కోట్లకు పరిమితమయింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం చైనాతో వాణిజ్య లోటు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లోనే రూ.8.50 లక్షల కోట్లు దాటింది.   ఫిబ్రవరిలో అమెరికా నుంచి దిగుమతులు 36 శాతం పెరిగి రూ.37 వేల కోట్లకు చేరాయి. చైనాకు ఎగుమతులు 32 శాతం పెరిగినప్పటికీ అక్కడి నుంచి దిగుమతులు భారీగా ఉండటంతో లోటు పెరిగింది.

స్విట్జర్లాండ్ నుంచి బంగారం దిగుమతులు ఫిబ్రవరిలో ఏడు రెట్లు పెరిగి రూ.22 వేల కోట్లకు చేరాయి. జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు ఎగుమతులు పెరగగా బ్రిటన్, సింగపూర్ దేశాలకు తగ్గాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా ప్రస్తుత నెలలోనూ ఎగుమతులు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ఆర్థికశాఖ సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు.