బియ్యం ఎగుమతుల్లో రికార్డ్!

బియ్యం ఎగుమతుల్లో రికార్డ్!

న్యూఢిల్లీ: దేశం నుంచి బియ్యం (బాస్మతి రైస్‌‌‌‌‌‌‌‌ మినహాయించి) ఎగుమతులు రికార్డ్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌లో పెరిగాయి. 2021–22  ఆర్థిక సంవత్సరంలో  బియ్యం ఎగుమతులు 6.11 బిలియన్ డాలర్ల (రూ. 46,400కోట్ల) కు చేరుకున్నాయి. 2013–14 టైమ్‌‌‌‌‌‌‌‌లో దేశం నుంచి కేవలం 2.92 బిలియన్ డాలర్ల (రూ.22,192 కోట్ల) విలువైన బియ్యం ఎగుమతులు మాత్రమే జరిగాయని కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 150 కి పైగా దేశాలకు రైస్‌ను ఎగుమతి చేశాం.   డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ అండ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం, 2019–20 లో  బియ్యం ఎగుమతులు (బాస్మతి మినహాయించి) 2 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2020–21 లో ఈ నెంబర్ 4.8 బిలియన్ డాలర్లకు, 2021–22 లో 6.11 బిలియన్ డాలర్లకు పెరిగింది.  క్వాలిటీ రైస్‌‌‌‌‌‌‌‌ను ప్రొడ్యూస్ చేయడంపై ఫోకస్ చేయడంతో  దేశం నుంచి రైస్ ఎగుమతులు పెరిగాయని అగ్రికల్చరల్‌‌‌‌‌‌‌‌ అండ్ ప్రాసెస్డ్‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) చైర్మన్ ఎం అంగముతు అన్నారు. పశ్చిమాఫ్రికా దేశమైన బెనిన్‌‌‌‌‌‌‌‌  మన దగ్గర నుంచి ఎక్కువగా రైస్‌‌‌‌‌‌‌‌ను దిగుమతి చేసుకుంది.  నేపాల్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, చైనా, సెనెగల్‌‌‌‌‌‌‌‌, గినియా, వియత్నాం, మడగాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెమరూన్‌‌‌‌‌‌‌‌ సోమాలియా, మలేషియా, లిబియా, యూఏఈ వంటి దేశాలు ఇండియా నుంచి ఎక్కువగా రైస్‌‌‌‌‌‌‌‌ను దిగుమతి చేసుకున్నాయి. పోర్టులు, పోర్టు రిలేటెడ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరించడం, సప్లయ్‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌ను మరింత మెరుగుపరచడం, కొత్త మార్కెట్లను గుర్తించడంతో గత రెండేళ్ల నుంచి  రైస్ ఎగుమతులు పెరుగుతున్నాయని కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. దేశంలో  తెలంగాణ, వెస్ట్ బెంగాల్‌‌‌‌‌‌‌‌, ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌, పంజాబ్‌‌‌‌‌‌‌‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చత్తీస్‌‌‌‌‌‌‌‌గడ్‌‌‌‌‌‌‌‌, ఒడిస్సా, అస్సాం, హర్యానా రాష్ట్రాలలో రైస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతోంది. 2021–22 లో మొత్తం 127.93 కోట్ల టన్నుల రైస్ ఉత్పత్తయిందని అంచనా.