సమగ్ర శిక్ష సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్

సమగ్ర శిక్ష సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్
  • నేటి నుంచే అమల్లోకి.. 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు అమలవుతున్న ఫేస్ రికగ్నైజన్ సిస్టమ్ (ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్) హాజరు విధానాన్ని ఇకపై సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికీ విస్తరించనున్నారు. 

శనివారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది వివరాలను పేరోల్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి తీసుకుని, ఎంప్లాయీ కోడ్ ఆధారంగా ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ యాప్‌‌‌‌లో రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు ఆదేశించారు.