టెర్రరిజం కట్టడిలో కెనడా సర్కారు ఫెయిల్.. 40 ఏండ్లుగా ఏమీ చేయలే: భారత్

టెర్రరిజం కట్టడిలో కెనడా సర్కారు ఫెయిల్.. 40 ఏండ్లుగా ఏమీ చేయలే: భారత్

న్యూఢిల్లీ: టెర్రరిజం కట్టడిలో కెనడా విఫలమైందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘తమ గడ్డ పైనుంచి ఆపరేట్ చేస్తున్న ఉగ్రవాద శక్తులను అంతం చేయడంలో కెనడా అధికారులు గత 40 ఏండ్లుగా విఫలమవుతూనే ఉన్నారు. కెనడా నిర్లక్ష్య వైఖరి కారణంగా మేం ఇబ్బందులు ఎదుర్కొంటున్నం” అని ఫైర్ అయింది. కెనడా ప్రభుత్వ మీడియా సీబీసీకి అక్కడి ఇండియన్ హైకమిషనర్ దినేశ్ పట్నాయక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఖలీస్తానీ టెర్రరిస్టు నిజ్జర్ హత్యతో ఇండియన్ ఏజెంట్లకు సంబంధం ఉందన్న ఆరోపణలకు బదులిస్తూ.. ‘‘అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే” అని తోసిపుచ్చారు.