మైలార్దేవ్ పల్లిలో భారీగా ఫేక్ కరెన్సీ

మైలార్దేవ్ పల్లిలో భారీగా ఫేక్ కరెన్సీ

రంగారెడ్డి జిల్లా  మైలర్ దేవ్ పల్లిలో భారీగా   నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు.7 లక్షల విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీనీ సీజ్ చేశారు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు‌.  ఏపీలోని  చిత్తూరు జిల్లాకు చెందిన గంగరాజు, అభినందన్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 కట్టల ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.   మహారాష్ట్రలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు  గుర్తించారు.

పక్కా సమాచారంతో  మైలార్ దేవ్ పల్లిలోని మెహిఫిల్ రెస్టారెంట్ దగ్గర నకిలీ నోట్లను అమ్ముతున్న   నిందితులిద్దరిని పోలీసులు పట్టుకున్నారు.   500 రూపాయల నోట్ల కట్టలలో కింద మీదా అసలు నోట్లు పెట్టి మధ్యలో నకిలీ నోట్లు పెట్టారు. నకిలీ 500 రూపాయల నోటు పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండవలసిన చోట చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించారు.  వారి నుంచి 6.62 లక్షల విలువ చేసే 500 రూపాయల 10 కట్టలను  స్వాధీనం చేసుకున్నారు.   మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిరు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.