నకిలీ బంగారంతో మహిళను మోసం చేసిన వ్యక్తి దొరికాడు

నకిలీ బంగారంతో మహిళను మోసం చేసిన వ్యక్తి దొరికాడు

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాలియా : నకిలీ బంగారు బిస్కట్లు ఇచ్చి లక్షలాది రూపాయలతో పారిపోయిన నలుగురిని నల్గొండ జిల్లా నిడమనూరు పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వీరరాఘవులు బుధవారం వెల్లడించారు. గుంటూరు జిల్లా రెంటపాలెంనకు చెందిన తీర్థాల నాగేశ్వరరావు, తీర్థాల అంజమ్మ అలియాస్ బత్తుల అంజమ్మ, బత్తుల రమణ, బత్తుల ఏడుకొండల్‌ ముఠాగా ఏర్పడ్డారు. పలు చోట్ల కిరాయికి ఉంటూ నకిలీ బంగారు బిస్కెట్లను ప్రజలకు ఇచ్చి డబ్బులు తీసుకొని పారిపోయేవారు. వీరు రెండు నెలలుగా నిడమనూరులోని కూరగాయల వ్యాపారి హేమలత ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు కూడా ఇటీవల బంగారు పూత పూసిన బిస్కెట్లను ఇచ్చి రూ. 5 లక్షలతో ఉడాయించారు. నకిలీ బంగారం అని గుర్తించిన హేమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా బుధవారం మిర్యాలగూడలోని ఈదులగూడ వద్ద పట్టుబడ్డారు. వారి నుంచి రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిం చినట్లు సీఐ చెప్పా రు.

తక్కువ ధర అంటూ నకిలీ బంగారం.. రూ.5 లక్షలు మోసపోయిన నల్గొండ జిల్లా మహిళ