
మల్కాజిగిరి, వెలుగు: మద్యం నకిలీ లేబుల్స్ తయారీ గుట్టురట్టయింది. హుజూర్ నగర్ లో కల్తీ మద్యం తయారీ కేసులో లభించిన ఆధారాలతో స్పెషల్‌టాస్క్‌ఫోర్స్ బృందం కుషాయిగూడలో దాడులు నిర్వహించింది. అంజిరెడ్డి టీం ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం కల్తీ మద్యం తయారీ కోసం నకిలీ లేబుల్స్ తయారు చేస్తున్న కేంద్రాన్ని గుర్తించారు.
గడ్డమీది నవీన్ గౌడ్ అనే వ్యక్తి శివసాయినగర్ నాగార్జున కాలనీలో ఓ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు. మద్యం నకిలీ లేబుల్స్ తయారుచేసేందుకు మల్టీ కలర్ మెషీన్లు, 15 రకాల సామగ్రిని ఉపయోగిస్తున్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రకాశ్, రాజేశ్‌ను అరెస్ట్ చేశారు.