పద్మారావునగర్, వెలుగు: కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పార్సిగుట్టలోని సంజీవపుర ప్రాంతానికి చెందిన జాల్డా కిషోర్ (40)కు కొంతకాలంగా తన భార్యతో వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గత పది రోజులుగా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి పైఅంతస్తులో ఒంటరిగా నివసిస్తున్నాడు. గత మూడ్రోజులుగా తన రూమ్‌నుంచి బయటకు రాలేదు. ఆదివారం ఉదయం గది వెలుపల రక్తం కన్పించడంతో కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా, లోపల మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న వారసిగూడ పోలీసులు, క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
