కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త..సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన

కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త..సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన

కోదాడ, వెలుగు: కుటుంబ కలహాలతో భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కలకలం రేపింది. కోదాడ టౌన్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం బాబు నగర్ కు చెందిన మణిదీప్, జగ్గయ్యపేటకు చెందిన శిరీషను ఏడేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకొని జగ్గయ్యపేటలో నివాసం ఉంటున్నారు.

కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో శిరీష కోదాడ పోలీస్ స్టేషన్లో మణిదీప్​పై ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో పోలీసులు ఇద్దరికీ నచ్చజెప్పడంతో తిరిగి కలుసుకున్నారు. బుధవారం కోదాడకు భార్యతో కలిసి షాపింగ్ కు వచ్చి తిరిగి వెళ్లేందుకు బస్టాండ్ కు చేరుకున్నారు.

తనపై కేసు పెట్టిందని భార్యపై కక్ష పెంచుకున్న మణిదీప్​  శిరీషపై కత్తితో దాడి చేయగా, తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.