ఫ్యాన్ గీసిన చిత్రానికి విఘ్నేష్ శివన్ ఫిదా

ఫ్యాన్ గీసిన చిత్రానికి విఘ్నేష్ శివన్ ఫిదా

అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కోలీవుడ్ స్టార్స్ నయనతార, విఘ్నేష్ శివన్ ల వివాహం ఇటీవలే జరిగింది. వీరికి సంబంధించి ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండ్ అయ్యాయి. అయితే వీరి వివాహం జరిగిన నిమిషం నుంచే ఫ్యాన్స్ వారి వెడ్డింగ్ కు సంబంధించిన ఫొటోస్ కోసం చాలా సెర్చ్ చేసినట్టు తెలుస్తోంది. కాగా మ్యారెజ్ అయిన చాలా సేపటికి ఈ జంట వివాహానికి సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చి వైరల్ అయ్యాయి. అయితే అలా సెర్చ్ వాళ్లలో ఉన్న ఒక ఫ్యాన్ మాత్రం.. కేవలం వారి పిక్స్ చూసి ఊరుకోలేదు. వారి మీద ఉన్న అభిమానాన్ని చేతల్లో చేసి చూపెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. పెళ్లిలో నయన్ నుదిటిపై విఘ్నేష్ ముద్దు పెడుతున్న ఫొటోను పోలి ఉండే చిత్రాన్ని వారి పేర్లతో రాసి, ఒక రూపానికి తీసుకువచ్చాడు. వెడ్డింగ్ పిక్చర్స్ కోసం ఎదురుచూశాన్న ఆ ఫ్యాన్.. వెంటనే దీన్ని గీయడం ప్రారంభించానని ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ వీడియోను చూసిన విఘ్నేష్.. థ్యాంక్యూ అంటూ తన రిప్లైను కూడా ఇచ్చారు. అయితే ఈ చిత్రాని గీయడానికి ఆ అభిమానికి దాదాపు 12 గంటల పైనే పట్టిందట. తన ఇష్టాన్ని ఇలా ఆర్ట్ రూపంలో చూపించిన ఆ ఫ్యాన్ గీసిన చిత్రానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.