ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో చార్జీలు తగ్గినయ్

 ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో చార్జీలు తగ్గినయ్

హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్ -విజయవాడ మధ్య ప్రారంభమైన ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో చార్జీలను తగ్గిస్తున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ వెల్లడించారు.  మియాపూర్ నుంచి విజయవాడకు రూ. 830గా నిర్ణయించినా రూ.750కి తగ్గించారు. ఎంజీబీఎస్ నుంచి విజయవాడకు రూ. 780గా ఉన్న టిక్కెట్ ధర రూ.710 కి తగ్గించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సుల టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉండేలా అధికారులు ప్లాన్ చేశారు. కానీ, చార్జీల్లో తేడా ఎందుకని ప్యాసింజర్లు ప్రశ్నించే అవకాశం ఉండటంతో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం పది ఈ-‌‌ గరుడ బస్సులను మియాపూర్లో ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.