జస్టిస్​​ నవీన్‌‌‌‌‌‌‌‌ రావుకు ఘనంగా వీడ్కోలు

జస్టిస్​​ నవీన్‌‌‌‌‌‌‌‌ రావుకు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ నవీన్‌‌‌‌‌‌‌‌రావుకు శుక్ర వారం హైకోర్టు వీడ్కోలు చెప్పింది. బాధ్యతలను స్వీకరించిన రోజునే ఆయన రిటైర్ కావడం గమనార్హం. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ కోర్టు హాల్లో ఫుల్‌‌‌‌‌‌‌‌ కోర్టు సమావేశమై ఘనంగా వీడ్కోలు చెప్పింది. తర్వాత హైకోర్టు బార్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ నవీన్‌‌‌‌‌‌‌‌రావు దంపతులను సత్కరిం చింది. కొత్త యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ సీజేగా జస్టిస్‌‌‌‌‌‌‌‌ అభినంద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ షావిలి బాధ్యతలు స్వీకరిస్తారు. 

ఇప్పటి దాకా చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌గా చేసిన జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టు జడ్జిగా ప్రమాణం చేశారు. కొత్త చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌గా మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన జస్టిస్‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌ అరధే కొద్ది రోజుల్లోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పుడాయన కర్నాటక హైకోర్టులో జడ్జిగా చేస్తున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరిస్తే తెలంగాణ హైకోర్టుకు 6వ సీజే అవుతారు.