తినడానికి తిండి లేనందునే రైతులు నిరసనలు చేస్తున్నారు

తినడానికి తిండి లేనందునే రైతులు నిరసనలు చేస్తున్నారు

చండీగఢ్: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై రగడ నడుస్తోంది. ఈ బిల్లులు రైతుల పాలిట శాపమంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వీటితో రైతులకు స్వేచ్ఛ లభించిందంటూ బీజేపీ అంటోంది. బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. బిల్లుల కారణంగా దశాబ్దాలుగా బీజేపీతో ఎన్డీయే కూటమిలో ఉన్న బంధాన్ని అకాలీదళ్ తెంచుకుంది. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ బిల్లులపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ స్పందించారు. రైతాంగ బిల్లులు ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, వీటిపై న్యాయపరంగా కోర్టుల్లో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. పంజాబ్ దగ్గర డబ్బులు లేవని, కేంద్రం అన్నింటినీ లాగేసుకుందన్నారు. కేంద్ర ఛారిటీ కింద తాము జీవనం సాగించాల్సి పరిస్థితి ఏర్పండిదని మండిపడ్డారు. రైతులను ఆందోళనల్లో పాల్గొనాలని ఎవరూ చెప్పరని.. తమ పిల్లలకు తినిపించడానికి తిండి లేనందున రైతులు నిరసనలకు దిగుతున్నారని పేర్కొన్నారు.