
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన రైతు బోరెం నర్సిరెడ్డి ఎకరం పొలంలో వంకాయ తోట వేశాడు. మార్కెట్లో ధర లేకపోవడంతో శుక్రవారం కూలీలతో తోట మొత్తాన్ని చెట్లతో సహా కోయించి ట్రాక్టర్లో వేసుకుని చౌటుప్పల్ కూరగాయల మార్కెట్ కు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశాడు. ఇటీవల సింగిల్‌విండో డైరెక్టర్‌గా ఎన్నికైన ఈయన రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు చెప్పారు.