హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే రైతు డిస్కమ్బహిరంగ విచారణను ఈ నెల 29కి ఈఆర్‌సీ వాయిదా వేసినట్టు సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న బక్రీద్ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రజలంతా ఈ మార్పును గమనించి బహిరంగ విచారణలో అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియచేయాలని ఆయన కోరారు.
