రైతులు సంతోషంగా లేని దేశం సుభిక్షంగా ఉండదు

రైతులు సంతోషంగా లేని దేశం సుభిక్షంగా ఉండదు

బాగ్‌‌పేట్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న రైతులకు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మద్దతుగా నిలిచారు. అన్నదాతలకు అండగా నిలవాలని ప్రధాని మోడీతోపాటు హోం మంత్రి  అమిత్ షాను సత్యపాల్ కోరారు. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేస్తే రైతుల మనసులను చూరగొనొచ్చన్నారు. ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులపై బలగాలను ప్రయోగించొద్దని ప్రభుత్వాన్ని తాను కోరానన్నారు. ‘కొత్త అగ్రి చట్టాలు రైతులకు అనుకూలంగా లేవు. ఏ దేశంలో అయితే రైతులు, సైనికులు సంతృప్తికరంగా ఉండరో ఆ దేశం సుభిక్షంగా ఉండదు, ముందుకు కూడా వెళ్లలేదు. అందుకే ఆర్మీతోపాటు అన్నదాతలను సంతోషంగా ఉంచాలి’ అని సత్యపాల్ పేర్కొన్నారు.