కన్నాపూర్‌‌‌‌‌‌‌‌ లో రైతుల ఆందోళన 

కన్నాపూర్‌‌‌‌‌‌‌‌ లో రైతుల ఆందోళన 

శంకరపట్నం, వెలుగు: మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ బుకింగ్‌‌‌‌ లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. శంకరపట్నం మండలం మెట్‌‌‌‌పల్లి సహకార సంఘం పరిధిలోని కన్నాపుర్ గ్రామానికి బుధవారం 230 బస్తాల యూరియా లోడ్ వచ్చింది.

సమాచారం తెలుసుకున్న కన్నాపూర్, ధర్మారం గ్రామాల రైతులు గోదాం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.  రోడ్డుపై తువాళలు పరిచి అందులో సెల్‌‌‌‌ఫోన్లు వేసి నిరసన తెలిపారు. మొబైల్‌‌‌‌లో బుకింగ్​లేకుండానే యూరియా బస్తాలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. దీంతో గోదాం సిబ్బంది యూరియా పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు.