కోరుట్ల, వెలుగు: రైతులు వాణిజ్య పంటలను సాగు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తాండ్రియాల, భూషణ్‌రావుపేట, సిరికొండ, దుంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.
దుంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పంటలు ఎండిపోకుండా ఎల్లంపల్లి నీటిని 3 సార్లు విడుదల చేసినట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిందన్నారు.

