- మార్కెట్లో మక్కలు కొనడం లేదని ధర్నా
జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల వ్యవసాయ మార్కెట్‌లో మక్కజొన్న రైతులు రెండోసారి రోడ్డెక్కారు. నెల రోజులుగా అమ్మకానికి తెచ్చి ఉంచిన మక్కజొన్నలను వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల–కోదాడ రోడ్డుపై శనివారం ధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. మార్కెట్‌కు వచ్చిన మక్కజొన్నను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోజుల తరబడి కొనుగోళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్న వేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమాచారం అందుకున్న జడ్చర్ల తహసీల్దార్ నర్సింగ్‌రావు రైతుల వద్దకు వెళ్లి చర్చించి ఆందోళన విరమింపజేశారు. మార్కెట్‌కు వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
