రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఘటన

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఘటన

జడ్చర్ల, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపూర్ రోడ్డులో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ పోల చంద్ర శేఖర్ (58) గురువారం రాత్రి బైక్ పై జడ్చర్లకు వెళ్తున్నాడు.

జడ్చర్ల శివారులోని గంగాపూర్ రోడ్డు వద్దకు రాగానే.. రోడ్డు పక్కన గొడవ పడుతున్న భార్యాభర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి బైక్ కు తగిలారు. ప్రమాదంలో చంద్రశేఖర్ తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఇద్దరినీ మహబూబ్ నగర్ లోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఇద్దరూ చనిపోయారు. డీలర్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమదు చేసినట్లు జడ్చర్ల టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు.