రైతులు అధైర్య పడొద్దు..ప్రతి గింజ కొనుగోలు చేస్తాం : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు

రైతులు అధైర్య పడొద్దు..ప్రతి గింజ కొనుగోలు చేస్తాం : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు
  •     విప్​, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి, వెలుగు: రైతులు అధైర్యపడవద్దని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐకేపీ, సింగిల్ విండో సొసైటీ ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. 

నియోజకవర్గంలో మక్కజొన్నలను కూడా 11 కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని, మక్కజొన్న రైతులు కూడా అధైర్యపడవద్దని, ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేస్తామని అన్నారు. మక్కజొన్న రైతులు గన్నీ సంచులు కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఒక్కో సంచికి రూ.21 చొప్పున సబ్సిడీని   చెల్లిస్తుందని తెలిపారు. ఆ మొత్తాన్ని సెంటర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ నిర్వహణ ఖాతాలో జమ చేసి, వారు గన్నీ సంచులు కొనుగోలు చేసిన రైతులకు అందజేస్తారని చెప్పారు. ప్రస్తుతం 60 శాతం వరి ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన 40 శాతం కొనుగోలు 15 రోజుల్లో పూర్తిచేస్తామని పేర్కొన్నారు.