బీమ్‌ యాప్‌ ద్వారా ఫాస్టాగ్‌ రీఛార్జి

బీమ్‌ యాప్‌ ద్వారా ఫాస్టాగ్‌ రీఛార్జి

టోల్‌ ప్లాజాల దగ్గర వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా… టోల్ టాక్స్ లు స్పీడ్ గా చెల్లించేందుకు ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. నగదు రూపంలో చెల్లిపులు జరపడం ద్వారా భారీగా ట్రాఫిక్​ స్తంభించడం, ఎక్కువ సమయం వృథా అవుతోంది. దీంతో వాహనదారులు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (NETC) కార్యక్రమానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ప్రారంభించింది.

ఈ క్రమంలో బీమ్‌ యాప్‌ ద్వారా కూడా ఫాస్టాగ్‌ను రీఛార్జి చేసుకోవచ్చని NPCI గురువారం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులు, పీటీఎంలాంటి చెల్లింపు యాప్‌ల ద్వారా ఫాస్టాగ్‌ను రీఛార్జి చేసుకునే అవకాశముంది. లేటెస్ట్ గా బీమ్ యాప్‌ కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

‘బీమ్‌ యాప్‌ ఉన్న వాహన యజమాని ఇక నుంచి ఫాస్టాగ్‌ రీఛార్జి చేసుకోవచ్చని తెలిపింది. డిసెంబరు 15వ తేదీ నుంచి జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలలో ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

చిన్న ఎలక్ట్రానిక్‌ చిప్‌ రూపంలో ఉండే ఫాస్టాగ్ ను … వాహనం ముందుండే అద్దం లోపలివైపు అతికిస్తారు. వాహనం టోల్‌ప్లాజా లైన్‌లోకి రావడంతోనే అక్కడ అమర్చిన ఎలక్ట్రానిక్‌ పరికరం వాహన ఫాస్టాగ్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నంబరు, మన పేరును గుర్తించి, ఖాతా నుంచి టోల్‌ రుసుంను ఆన్‌లైన్‌లోనే తీసుకుంటుంది. ఇదంతా 10 సెకండ్లలోనే జరిగిపోతుంది.