మహబూబ్ నగర్లో ఘోరం.. 140 స్పీడ్లో కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి

మహబూబ్ నగర్లో ఘోరం.. 140 స్పీడ్లో కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, స్పోర్ట్స్ బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు యువకులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

చనిపోయిన ఐదుగురు మహబూబ్ నగర్లోని న్యూ ప్రేమ్ నగర్కు చెందిన వారు కావడం గమనార్హం. చనిపోయిన వారిని ఆర్షియా బేగం(30), మహ్మద్ ఉజేప (7), మహ్మద్ అమర్ (2), హైదరాబాద్కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్ (25)గా పోలీసులు గుర్తించారు.

నల్లగొండ జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు పల్టీ  కొట్టింది. 

ఆయిల్ ట్యాంకర్ లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు పల్టీ కొట్టిన ఈ ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై అడ్డంగా పడిన వాహనాలను పక్కకు తీసి చిట్యాల పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు.