లాహోర్/పెషావర్: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా ఓ ట్రక్కు వంతెనపై నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పిల్లలు సహా 14 మంది మరణించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధ జిల్లా కోట్ మోమిన్‌లో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. యాక్సిడెంట్జరిగిన సమయంలో ట్రక్కులో 23 మంది ఉన్నారని పంజాబ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రెస్క్యూ ప్రతినిధి తెలిపారు.
వారంతా వారి బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ నుంచి ఫైసలాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. “భారీ పొగమంచు కారణంగా మోటార్వే మూసివేశారని.. ట్రక్కును డ్రైవర్లోకల్రూట్లో తీసుకెళ్లాడని.. ఆ రూట్లో విజిబిలిటీ సరిగా లేకపోవడం వల్ల వెహికల్నియంత్రణ కోల్పోయి గాలాపూర్ బ్రిడ్జి పై నుంచి నీరులేని కాలువలో పడిపోయిందని రెస్క్యూ ప్రతినిధి తెలిపారు.
ప్యాసింజర్ వెహికల్ బోల్తాపడి 9 మంది..
మరో ఘటనలో బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ సమీపంలో మక్రాన్ కోస్టల్హైవేపై శనివారం తెల్లవారుజామున ప్యాసింజర్ వెహికల్బోల్తా పడి 9 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వెహికల్అతివేగం కారణంగానే బోల్తా పడి ఈ ప్రమాదం జరిగిందని కోస్టల్ హైవే ఎస్పీ తెలిపారు.
