కూతురి పెండ్లిలో డ్యాన్స్ చేస్తుండగా తండ్రికి హార్ట్ ఎటాక్

కూతురి పెండ్లిలో డ్యాన్స్ చేస్తుండగా తండ్రికి హార్ట్ ఎటాక్

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్లో కూతురు పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తుండగా తండ్రి దాసు చనిపోయాడు. గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు దాసు. ఘటనతో పెళ్లింట్లో విషాదం నింపింది. అంబేద్కర్ నగర్ కు చెందిన దాసు హుజరాబాద్ లో ఆర్టీఏ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. దాసుకు ముగ్గురు కూతుర్లున్నారు. పెద్ద కూతురు వీణ పెళ్లిన ఘనంగా చేశాడు. బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా గుండెనొప్పితో చనిపోయాడు. అప్పటి వరకు ఆనందంగా ఉన్న పెళ్లి పందిట్లో విషాదం నెలకొంది.