పద్మారావునగర్, వెలుగు: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్కొత్త అడుగు వేసింది. మగవారి వీర్యకణాలను ఏఐ టెక్నాలజీ ద్వారా పరీక్షించేందుకు లెన్స్హుక్ X12 ప్రో సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సిబుడి తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ లో టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ క్యాంపెయిన్ పేరుతో కార్యక్రమం నిర్వహించి, కేక్ కట్‌చేశారు. సినీ నటి లయ కొత్త టెక్నాలజీని ప్రారంభించారు.
ఫెర్టిలిటీ రేట్2.1 కంటే తక్కువ ఉండొద్దని, మన దేశంలో అది 1.9కి పడిపోయిందన్నారు. ఏపీలో 1.7, తెలంగాణలో 1.8 ఉండడం ఆందోళనకర అంశమని చెప్పారు. ఏఐ టెక్నాలజీ ద్వారా 6 నిమిషాల్లో 3 వేల వీర్యకణాలను పరీక్షించి, డీఎన్ఏ లోపాలను గుర్తించవచ్చని, సరైన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం తల్లిదండ్రులుగా మారినవారు తమ కల, సక్సెస్ స్టోరీని పంచుకున్నారు. టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ క్యాంపెయిన్ కింద దంపతులకు అసెస్మెంట్ ప్యాకేజీని రూ.599కే అందిస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈవో వినేశ్ గదియా పేర్కొన్నారు.
