ఫిడే గ్రాండ్‌‌‌‌ స్విస్‌‌‌‌ టోర్నీలో అర్జున్‌‌‌‌ 8వ గేమ్‌‌‌‌ డ్రా

ఫిడే గ్రాండ్‌‌‌‌ స్విస్‌‌‌‌ టోర్నీలో అర్జున్‌‌‌‌ 8వ గేమ్‌‌‌‌ డ్రా

సమర్కండ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌): తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. ఫిడే గ్రాండ్‌‌‌‌ స్విస్‌‌‌‌ టోర్నీలో మరో డ్రా నమోదు చేశాడు. సర్గాన్‌‌‌‌ శాంట్‌‌‌‌తో శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ను అర్జున్‌‌‌‌ 31 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. తెల్లపావులతో ఆడిన తెలంగాణ ప్లేయర్‌‌‌‌ కీలక టైమ్‌‌‌‌లో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయాడు. ఈ రౌండ్‌‌‌‌ తర్వాత అర్జున్‌‌‌‌ ఐదు పాయింట్లతో కొనసాగుతున్నాడు. నిహాల్‌‌‌‌ సరీన్‌‌‌‌.. బ్లుబెమ్‌‌‌‌ మథియాస్‌‌‌‌ మధ్య జరిగిన గేమ్‌‌‌‌ కూడా 21 ఎత్తుల వద్ద, ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద.. రాపోర్ట్‌‌‌‌ రిచర్డ్‌‌‌‌ మధ్య జరిగిన గేమ్‌‌‌‌ 39 ఎత్తుల వద్ద డ్రా అయ్యాయి. 

అంటోన్‌‌‌‌ గుజారో డేవిడ్‌‌‌‌తో జరిగిన గేమ్‌‌‌‌లో పెంటేల హరికృష్ణ 32 ఎత్తుల వద్ద ఓటమిపాలయ్యాడు. పురానిక్‌‌‌‌ అభిమన్యు.. సింధరోవ్‌‌‌‌ మధ్య జరిగిన గేమ్‌‌‌‌ డ్రా అయ్యింది. ఇక విమెన్స్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో ద్రోణవల్లి హారిక.. గిర్యా ఓల్గా మధ్య జరిగిన గేమ్‌‌‌‌ 43 ఎత్తుల వద్ద డ్రా కాగా, అసబుయెవా బిబిసారాతో జరిగిన గేమ్‌‌‌‌లో ఆర్‌‌‌‌. వైశాలి 39 ఎత్తుల వద్ద ఓటమిపాలైంది.