Technology in Sports: క్రీడాభిమానులకు ఈ జూన్ నెల ఒక పెద్ద పండగలా మారింది. ఒకవైపు భారత్– -ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లు, మరోవైపు అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలలో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026 ధూంధాంగా జరుగుతుంది. ప్రతి నాలుగేళ్లకొకసారి వచ్చే ఈ ఫుట్‌బాల్ మహాసంగ్రామాన్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. టోర్నీలో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ముగిశాయి. అయితే, ప్రతి వరల్డ్ కప్‌లో ఏదో ఒక కొత్త రూల్‌ను లేదా టెక్నాలజీని పరిచయం చేసే ఫిఫా (FIFA).. ఈసారి గియాని ఇన్ఫాంటినో నేతృత్వంలో క్రికెట్ నుంచి ఇన్‌స్పైర్ అయి ‘స్నికోమీటర్’ (Snickometer) టెక్నాలజీని ఫుట్‌బాల్‌లోకి తీసుకొచ్చింది.
స్వీడన్ మ్యాచ్‌లో ‘స్నికోమీటర్’ మ్యాజిక్:
ఈరోజు (సోమవారం) స్వీడన్, ట్యునీషియా దేశాలు తమ వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభించాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్వీడన్ ఫార్వర్డ్ ప్లేయర్ అలెగ్జాండర్ ఇసాక్ బంతిని తాకాడా లేదా అని చూడటానికి ఈ స్నికోమీటర్‌ను వినియోగించారు. మ్యాచ్ 84వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన మథియాస్ స్వాన్‌బర్గ్, లోపలికి వచ్చిన కేవలం 16 సెకన్లలోనే అద్భుతమైన గోల్ కొట్టాడు. ఈ గోల్ కొట్టే సమయంలో అలెగ్జాండర్ ఇసాక్ కి బంతి తగిలిందని భావించడంతో గోల్‌ను ఇవ్వడానికి రెఫరీ నిరాకరించాడు. దాంతో, వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) ఈ క్రికెట్ స్టైల్ ‘స్నికోమీటర్’ గ్రాఫ్‌ను ఉపయోగించి.. బంతిని ఎవరు టచ్ చేయలేదని తేలడంతో.. రెఫరీ తన నిర్ణయాన్ని మార్చుకుని స్వీడన్‌కు గోల్ ఇచ్చాడు.
ఫుట్‌బాల్ స్నికోమీటర్ అంటే ఏంది?:
క్రికెట్‌లో బ్యాట్‌కు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి స్నికో (Snicko) లేదా అల్ట్రా ఎడ్జ్ వాడినట్టే.. ఫుట్‌బాల్‌లో కూడా ప్లేయర్ కాళ్లకు లేదా బాడీకి బంతి ఏ కచ్చితమైన క్షణంలో తగిలిందో తెలుసుకోవడానికి వీఏఆర్ (VAR) రివ్యూల కోసం ఈ గ్రాఫ్‌ను వాడుతున్నారు. బంతి వేరే ఎవరికైనా తగిలి డైరెక్షన్ మారితే (Deflection), క్రికెట్ లాగే ఈ గ్రాఫ్‌లో కూడా ఒక పెద్ద స్పైక్ కనిపిస్తుంది.
స్నికోమీటర్ పనిచేసే విధానం:
* మోషన్ సెన్సార్ (The Motion Sensor): వరల్డ్ కప్‌లో వాడే అఫీషియల్ మ్యాచ్ బాల్స్ మధ్యలో అత్యంత సెన్సిటివ్ అయిన ఒక మైక్రోచిప్‌ను అమర్చారు.
* డేటా ట్రాకింగ్ (Data Tracking): బంతికి తగిలే ప్రతి చిన్న టచ్ లేదా ఇంపాక్ట్‌ను ఈ సెన్సార్ సెకనుకు 500 సార్లు (500 times a second) ట్రాక్ చేస్తుంది.
* విజువల్ గ్రాఫిక్ (The Visual Graphic): బంతి ఎవరికైనా తగిలిందా లేదా అని చెక్ చేయాల్సి వచ్చినప్పుడు సిస్టమ్ ఒక గ్రాఫ్‌ను స్క్రీన్‌పై చూపిస్తుంది. బంతి ఎవరికీ తగలకపోతే అందులోని గీత ఫ్లాట్ లైన్ (Flat Line)లో కనిపిస్తుంది.. ఒకవేళ తగిలితే మాత్రం అక్కడ స్పైక్ (Spike) కనిపిస్తుంది. దీనివల్ల ఏ ఫ్రేమ్‌లో బంతిని తాకారో కచ్చితంగా తెలిసిపోతుంది.
క్రికెట్ స్నికోమీటర్‌కు.. ఫిఫా స్నికోమీటర్‌కు తేడాలు?:
* క్రికెట్ స్నికోమీటర్: బ్యాట్‌కు బంతి చాలా స్వల్పంగా తగిలినా (Faint Edges) క్యాచ్‌లు లేదా ఎడ్జ్‌లను గుర్తించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది బ్యాట్-బాల్ కాంటాక్ట్ జోన్ దగ్గర ఉండే మైక్రోఫోన్ల నుంచి వచ్చే ఆడియో సిగ్నల్స్ ఆధారంగా వర్క్ చేస్తుంది. దీనికి క్రికెట్ బ్రాడ్‌కాస్టింగ్‌లో చాలా పెద్ద చరిత్రనే ఉంది. 2013 యాషెస్ సిరీస్‌లో దీని అప్‌గ్రేడెడ్ వర్షన్ అల్ట్రా ఎడ్జ్ కూడా వచ్చేసింది.
* ఫిఫా ఫుట్‌బాల్ స్నికోమీటర్: గోల్ కొట్టే గందరగోళ సమయంలో బంతి ఎవరికైనా తగిలిందా లేదా ఆఫ్‌సైడ్ బిల్డప్‌లను చెక్ చేయడానికి దీన్ని వినియోగిస్తారు. ఇది బంతి మధ్యలో ఉండే సెన్సార్ ఆధారంగా వచ్చే ఆడియో -విజువల్ వేవ్‌ఫార్మ్ (గ్రాఫ్), టైమ్‌స్టాంప్‌ల ఆధారంగా పని చేయనుంది. 2026 ఫిఫా వరల్డ్ కప్‌లోనే మొదటిసారిగా దీన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు.
