కేసులకు భయపడం.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం: పొన్నం ప్రభాకర్

కేసులకు భయపడం.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: మాపై కేసులు పెడితే భయపడేది లేదు..న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.. అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం  ప్రభాకర్ స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ప్రవీణ్ యాదవ్ మృతి పైన పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందేనని పునరుద్ఘాటించారు. ప్రవీణ్ యాదవ్ హాస్పిటల్ లో కంప్యూటర్ ఆపరేటర్ పని చేసారు.. సూపరింటెండెంట్ అకారణంగా సస్పెన్షన్ చేశారు.. ఆయనకు అర్హత లేకుంటే మూడేళ్లు ఎలా ఆపరేటర్ గా పనిచేస్తారని ప్రశ్నించారు. ప్రవీణ్ యాదవ్ మృతికి హుజురాబాద్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వేధింపులు కారణమని ఆరోపించారు.

ప్రవీణ్ యాదవ్ టిఆర్ఎస్ నాయకులుగా కూడా పని చేసారు.. భట్టి విక్రమార్క హాస్పిటల్ విజిట్ కు వచ్చినపుడు అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై కేసు పెట్టాలని డిమాండ్ చేప్తే..  ఉల్టా కాంగ్రెస్ నాయకులపై కేసుపెట్టారని విమర్శించారు. సూపరింటెండెంట్ ప్రవీణ్ రెడ్డి వేధింపులతోనే ప్రవీణ్ యాదవ్ మృతి చెందారని అక్కడ ఉద్యమాలు జరిగాయి… కాంగ్రెస్ నాయకులు డాక్టర్లను అనవసరంగా వేధింపులకు గురి చేయము.. కానీ ఒక అమాయకులను బలి చేస్తే ఊరుకోమన్నారు. ఈ సమస్యలపై న్యాయస్థానాలు ఆశ్రయిస్తా… హ్యూమన్ రైట్స్ కమిషన్ ను కూడా కలుస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుజురాబాద్ లో వైద్య శాఖ మంత్రి ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర ఇలాంటివి జరగడం దురదృష్టకరం అన్నారు.  రాష్ట్రంలో కరోనో విపరీతంగా ఉంది. కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని పొన్నం విమర్శించారు.