గవర్నర్ ఆమోదం తర్వాతే పోస్టుల భర్తీ: ఓయూ వీసీ రవీందర్​

గవర్నర్ ఆమోదం తర్వాతే పోస్టుల భర్తీ: ఓయూ వీసీ రవీందర్​

వచ్చే నెల 3, 4న ఓయూ గ్లోబల్ అలుమ్నీ మీట్

ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి చెందిన రిక్రూట్​మెంట్​పై గవర్నర్ ఆమోదం రాగానే చర్యలు చేపడతామని ఓయూ వైస్​చాన్స్​లర్​ ప్రొఫెసర్ రవీందర్​ అన్నారు. ఓయూలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్​రిక్రూట్​ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, దీనికి సంబంధించిన ఫైల్ ఇంకా​గవర్నర్ తమిళిసై వద్ద ఉందని రవీందర్ తెలిపారు. క్లియరెన్స్​రాగానే అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడించారు.

ఓయూ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా రావాలి

ఓయూ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చే నెల 3,4  తేదీల్లో జరగనున్న ‘ఉస్మానియా గ్లోబల్ అలుమ్ని మీట్-2023’లో పాల్గొనాలని వీసీ రవీందర్ పిలుపునిచ్చారు. క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. విభాగాల వారీగా ఆలుమ్నీ సమావేశాలు జరుగుతున్నా.... ఉస్మానియా ఓల్డ్ స్టూడెంట్ల సమావేశం జరగటం ఇదే తొలిసారని ఆయన వివరించారు. ‘కనెక్ట్ టు రీ కనెక్ట్’ పేరుతో ఇప్పటికే వెయ్యి మంది ఓల్డ్ స్టూడెంట్లు సమ్మేళనంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. స్పాట్ రిజిస్ట్రేషన్లకు కూడా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దాదాపు 300 మందిని ఓల్డ్ స్డూడెంట్లను వలంటీర్లుగా ఎంపిక చేశామన్నారు. ఓయూ గ్లోబల్ అలుమ్నీ  మీట్ కోసం16 కమిటీలు పనిచేస్తున్నాయని చెప్పారు. వర్సిటీ అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చలు(ప్యానల్ డిస్కషన్స్) ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, క్యాబ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజశేఖర్, ప్రొఫెసర్ స్టీవెన్ సన్  పాల్గొన్నారు.