
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. సినిమా ప్రదర్శనలు యధావిధిగా కొనసాగుతాయని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ చెప్పారు. మే 24న డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లతో నిర్మాతలు భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన దామోదర ప్రసాద్.. సమస్యలపై మే 30న కమిటీ వేస్తున్నామని చెప్పారు.అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇండస్ట్రీ కోసం కలిసి పనిచేయాల్సిందేననన్నారు.
ఎవరికి వారు ఊహాజనిత వార్తలు ప్రచారం చేస్తున్నారని.థియేటర్ల బంద్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు దామోదర ప్రసాద్. త్వరలోనే చిత్రపరిశ్రమలో అన్ని వర్గాలను కలిసి సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. కొన్ని సమస్యలను త్వరలోనే సినిమాటో గ్రఫి మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి చర్చిస్తామన్నారు దాంమోదర ప్రసాద్.
తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు జూన్ 1 నుంచి మూసివేస్తామని.. రెంటల్ బేసిస్‌లో షోలు వేయలేమని ఇటీవల ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లింపులు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. రోజువారీ అద్దె కాకుండా గ్రాస్ కలెక్షన్స్‌లో వాటా ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే థియేటర్లు తెరుస్తామని.. లేదంటే, జూన్ 1 నుంచి మూసేస్తామని నిర్ణయించారు. లేటెస్ట్ గా ఇవాళ ఫిల్మిఛాంబర్ లో నిర్మాతలతో సమావేశమై చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తూ థియేటర్ల బంద్ ను విరమించుకున్నట్లు ప్రకటించారు.