పవన్‌‌‌‌ మూవీ టైటిల్‌‌‌‌తోనే నితిన్ కొత్త సినిమా

పవన్‌‌‌‌ మూవీ టైటిల్‌‌‌‌తోనే నితిన్ కొత్త సినిమా

డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు నితిన్. తాజాగా మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ‘వకీల్ సాబ్’ ఫేమ్  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేయగా, మరో  దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ‘తమ్ముడు’ టైటిల్‌‌‌‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు.

ఇదే టైటిల్‌‌‌‌తో ఇరవై నాలుగేళ్ల క్రితం పవన్ కళ్యాణ్‌‌‌‌ నటించిన సినిమా సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. పవన్‌‌‌‌కి నితిన్ ఫ్యాన్‌‌‌‌ కాగా, ఇప్పుడు ఆయన టైటిల్‌‌‌‌తోనే నితిన్ నటించడం సినిమాపై ఆసక్తి పెరిగింది.  దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌‌‌‌లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది.  

దంగల్, కహానీ, తారే జమీన్ పర్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన సత్యజిత్ పాండే (సేతు) సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 1 నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.