ఫస్ట్​ తారీఖే జీతాలు .. నాలుగేండ్ల తర్వాత ఇన్​టైమ్​లో జమ

ఫస్ట్​ తారీఖే జీతాలు .. నాలుగేండ్ల తర్వాత ఇన్​టైమ్​లో జమ
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు  ఈ నెల ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దాదాపు నాలుగేండ్ల తర్వాత ఇన్ టైంలో డబ్బులు పడ్డాయని ఉద్యోగులు, పెన్షనర్లు తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు మార్చి నెల 1వ తేదీన జమ చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,88,000 మంది పెన్షన్ దారుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. గత బీఆర్ఎస్ సర్కార్ నెలలో మొదటి వారం నుంచి మూడో వారం వరకు జీతాలు చెల్లిస్తూ వచ్చింది. 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు  మార్చి ఫస్ట్​ తేదీ శుక్రవారమే జీతాలు, పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దాదాపు నాలుగేండ్ల తరువాత ఇన్ టైంలో డబ్బులు పడటంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు మార్చి నెల 1వ తేదీన జమ చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,88,000 పెన్షన్ దారుల ఖాతాల్లో అమౌంట్ పడ్డాయి.  

గత బీఆర్ఎస్ సర్కార్ నెలలో మొదటి వారం నుంచి మూడో వారం వరకు జీతాలు చెల్లిస్తూ వచ్చింది.  దీంతో ఈఎంఐలు క్లియర్ చేసుకునేందుకు ఉద్యోగులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పరిస్థితిలో మార్పు తెస్తామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా  డిసెంబర్ నెల జీతం జనవరి 6వ తేదీన జమ చేయగా.. జనవరి నెల జీతం ఫిబ్రవరి 7న జమ చేశారు. ఫిబ్రవరి జీతం డబ్బులు మార్చి 1వ తేదీనే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం పట్ల యూటీఎఫ్ రాష్ట్ర  అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి, సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.