లింగాల, వెలుగు: సీటు బెల్టు లేదని ట్రాక్టర్ డ్రైవర్ కు ఫైన్ వేశారు. నాగర్కర్నూల్జిల్లా లింగాల మండలం సూరపూర్ గ్రామానికి చెందిన వీరాస్వామి పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ లేదని చెప్పి రూ. 500 ఫైన్, సీటు బెల్ట్ లేదని రూ. 100 ఫైన్ వేశారు. వీరాస్వామి ఇంటికి వెళ్లి ఆన్లైన్లో చెక్ చేయగా ఫైన్ విధించినట్లు తెలిసింది.
