ఆర్సీబీ పేసర్‌‌‌‌ యష్‌‌‌‌ దయాల్‌‌‌‌పై ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌.. లైంగిక వేధింపుల ఆరోపణలే కారణం

ఆర్సీబీ పేసర్‌‌‌‌ యష్‌‌‌‌ దయాల్‌‌‌‌పై ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌.. లైంగిక వేధింపుల ఆరోపణలే కారణం

ఘజియాబాద్‌‌‌‌ (యూపీ): ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్‌‌‌‌ యష్ దయాల్‌‌‌‌పై ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీలు ఇవ్వడం, మోసపూరితంగా లైంగిక సంబంధం పెట్టుకోవడంతో.. బీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ 69 ప్రకారం అతనిపై ఇందిరాపురం పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

గత ఐదేళ్లుగా యష్‌‌‌‌.. తనతో రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఉన్నట్లు ఓ మహిళ ఐజీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ (ఇంటిగ్రేటెడ్‌‌‌‌ గ్రీవెన్స్‌‌‌‌ రిడ్రెస్సల్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌) ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులకు పరిచయం చేయడంతో తాను యష్‌‌‌‌ను నమ్మానని సదరు మహిళ వెల్లడించింది. 

కొద్ది రోజుల తర్వాత మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు డబ్బులు కూడా తీసుకున్నట్లు తెలిపింది. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, చాట్‌‌‌‌ రికార్డులు, స్క్రీన్‌‌‌‌ షాట్స్‌‌‌‌, కాల్‌‌‌‌ రికార్డింగ్‌‌‌‌లు, ఫొటోలను పోలీసులకు అందజేసింది. ఈ మొత్తం వ్యవహారంపై యష్‌‌‌‌ నుంచి గానీ, అతని ఫ్యామిలీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.