కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పరిధి ప్రశాంతినగర్పారిశ్రామిక వాడలోని ఏబీసీ ప్రింటింగ్ ఇంక్ తయారీ పరిశ్రమలో మంగళవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి, ఫ్యాక్టరీ అంతా వ్యాపించాయి.
వర్కర్స్సాయంత్రం 6 గంటలకే విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేలోపే రా మెటీరియల్, మెషినరీ కలిపి మొత్తం రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఫ్యాక్టరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
