హైదరాబాద్ లోని నిజాంపేట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ( మే 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నిజాంపేట్ లోని హై టెన్షన్ లైన్ రోడ్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది.
రెండో శనివారం కావడంతో బ్యాంకు సెలవు కాబట్టి పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
