గాంధీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం

గాంధీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ ప్యానెల్ బోర్డ్ లో మంటలు చెలరేగాయి. వెంటనే హాస్పిటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  ఫైర్ సిబ్బంది విద్యుత్ ప్యానెల్ బోర్డ్ లో వ్యాపించిన మంటలు పూర్తిగా అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో కొంతసేపు  హాస్పిటల్ లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అయితే షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా విద్యుత్‌ బోర్డు ప్యానెల్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఉదయం ఏడున్నర సమయంలో గాంధీలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షాట్ సర్క్యూట్ తో మూడో ఫ్లోర్ లో మంటలు వచ్చాయంటున్నారు సిబ్బంది. ఆరో ఫ్లోర్ వరకు దట్టంగా పొగలు వ్యాపించాయి. ఘటనతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 40 నిమిషాల్లో మంటలు, పొగలు అదుపులోకి తెచ్చామన్నారు గాంధీ హాస్పిటల్ అధికారులు, సిబ్బంది. ప్రమాదంతో హాస్పిటల్లోని రోగులు వారి బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు.