జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర్ ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా.. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 15 లక్షల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

అయితే షార్టు సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మిల్లులో 7 గ్యాస్ సిలిండర్లు ఉండగా అందులో ఒక గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.